మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ

మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ


సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తమ పార్టీ ఎంపీలు ఎవరు  టచ్‌లో ఉన్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ ఎంపీలపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 



చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుంది. సీఎం జగన్‌ అనుకుంటే అర్థగంటలో అందరూ వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేస్తారు. కానీ అటువంటి పనులకు తమ నాయకుడు దూరం. బీజేపీతో వైఎస్సార్ సీపీ  ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఇంకా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయిదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదా?. ఇసుక అమ్ముకుని బతికిన ఘటన టీడీపీది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజలంతా జగన్‌ పాలన శభాష్‌ అంటున‍్నారు.