అమెరికా యుద్దనౌన థియోడర్ రూజ్‌వెల్ట్‌లో సుమారు 4000 మంది సిబ్బంది ప్రమాదంలో ఉన్నట్లు దాని కెప్టెన్ బ్రెట్ కోజర్ ఓ ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కెప్టెన్‌ను విధుల నుంచి తొలగించినట్లు అమెరికా నౌకాదళం ప్రకటించింది. యుద్ధం లేకున్నా.. తమ నౌకలో ఉన్న సిబ్బంది అన్యాయంగా మృతిచెందనున్నట్లు కెప్టెన్ బ్రెట్ మీడియాకు ఓ లేఖను రిలీజ్ చేశారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. యుద్ధనౌకలో సుమారు వంద మందికి కరోనా పాజిటివ్ తేలిందని, ఒకవేళ తమ నౌకను డాకింగ్ చేయకుంటే, దాంట్లో ఉన్నవారందరికీ ప్రమాదం ఏర్పడుతుందని కెప్టెన్ బ్రెట్ .. పెంటగాన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు కూడా కెప్టెన్ రిలీశారు. దీన్ని ప్రభుత్వ అధికారులు తప్పుపట్టారు. తమ అభ్యర్థనలను నేవీ పట్టించుకోవడంలేదన్నట్లుగా కెప్టెన్ ప్రవర్తన ఉందని అధికారులు చెప్పారు. అందుకే అతన్ని తొలగించినట్లు వారు వెల్లడించారు.
4వేల మందిని కాపాడాలన్న యుద్ధనౌక కెప్టెన్‌ను తొలగించారు..