గది గోడలు పగలగొట్టి దుండగులు మద్యం దొంగతనం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్రీవెంకటేశ్వర వైన్స్ దుకాణంలో గడిచిన రాత్రి దొంగలు మద్యం లూటీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించి రూ. లక్ష విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
గోడలు పగలగొట్టి మద్యం దొంగతనం